జనగణన-2027లో భాగంగా స్వీయ గణన ప్రక్రియతో కార్యక్రమం వేగవంతం అవుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. గురువారం హాజీపూర్ మండలం సబ్బెపల్లి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్లకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జనగణన రెండు విడతలుగా జరుగుతుందని, మొదటి విడతలో మే 11 నుండి జూన్ 9 వరకు ఇండ్ల గణన, రెండో విడతలో అసలు జనగణన ఉంటుందని వెల్లడించారు. డిజిటల్ సాంకేతికతతో నాణ్యమైన జాబితా రూపొందిస్తామని పేర్కొన్నారు.