ప్రభుత్వ హాస్టళ్లకు వచ్చే విద్యార్థులకు సొంత ఇంటి వాతావరణం కల్పించేలా చూడాలని జిల్లా జాయింట్ కలెక్టర్ చంద్రయ్య సూచించారు. మంచిర్యాల జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ల వార్డెన్లు, కామాటి వంట సిబ్బందితో గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన ఒకరోజు అవగాహన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు పౌష్టికాహారంతో పాటు చదువుకునేందుకు మంచి వాతావరణం కల్పించాలని పేర్కొన్నారు.