TG: రాష్ట్రంలో భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు జరిగాయి. ఏకంగా 91 మంది మున్సిపల్ కమిషనర్లు ప్రభుత్వం బదిలీ చేస్తూ పురపాలకశాఖ కార్యదర్శి టీకే.శ్రీదేవి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని ఆయా మున్సిపాలిటీలతోపాటు జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీలోని మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేశారు. దీంతో పాటు గ్రూప్-1, గ్రూప్-2 ద్వారా వచ్చిన కొత్త మున్సిపల్ కమిషనర్లకు సైతం పోస్టింగ్ ఇచ్చారు.