దేశంలో తగ్గుతున్న మాతృ మరణాలు

రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (ఆర్జీఐ) బులిటెన్ 2021-23 ప్రకారం.. దేశవ్యాప్తంగా మాతృ మరణాల నిష్పత్తి (ఎంఎంఆర్) గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం ప్రతి లక్ష సజీవ జననాలకు మాతృ మరణాల రేటు 88కి చేరింది, ఇది గతంలో 93గా ఉండేది. అయితే, దేశవ్యాప్తంగా తగ్గుదల ఉన్నప్పటికీ తెలంగాణలో మరణాలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో ఎంఎంఆర్ 2019-21లో 45 నుంచి 2021-23 నాటికి 59కి పెరిగింది. ఏపీలో ఎంఎంఆర్ 46 నుంచి 30కి తగ్గింది. కేరళ, ఏపీ, తమిళనాడులలో మాతృ మరణాలు తక్కువగా ఉండగా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లలో ఎక్కువగా ఉన్నాయి.

సంబంధిత పోస్ట్