మూడో కాన్పుకు మెటర్నిటీ లీవ్స్ ఇవ్వాలి: మద్రాస్ హైకోర్టు

ప్రసూతి సెలవులకు సంబంధించి మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మూడోసారి గర్భం దాల్చిన మహిళా ఉద్యోగినులకు కూడా ప్రసూతి సెలవులను నిరాకరించకూడదని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రసూతి ప్రయోజనాలు మానవీయ కోణంతో కూడుకున్నవని, వాటిని కేవలం పిల్లల సంఖ్యతో ముడిపెట్టలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రసూతి ప్రయోజనాల చట్టం ప్రకారం సెలవుల విషయంలో పిల్లల సంఖ్యపై పరిమితి విధించలేదని వివరించింది. మూడో కాన్పు అని చెప్పి సెలవులు నిరాకరించడం వివక్ష అవుతుందని, సదరు మహిళా ఉద్యోగికి వెంటనే సెలవులు మంజూరు చేయాలని హైకోర్టు తీర్పును వెలువరించింది.

సంబంధిత పోస్ట్