అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా కార్మికుల హక్కులు, వారి పోరాటాలను స్మరించుకుంటున్నారు. 1886 మే 1న అమెరికాలోని చికాగోలో జరిగిన నిరసనల్లో పోలీసుల కాల్పుల్లో కార్మికులు మరణించడంతో, 1889 నుంచి మే 1న మేడే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు లేనప్పటికీ, బ్యాంకులకు సెలవు ప్రకటించారు. పలు ప్రైవేట్ సంస్థలకు కూడా సెలవు ఉంది. బుద్ధ పూర్ణిమ కారణంగా ఇవాళ ఐచ్ఛిక (ఆప్షనల్ హాలిడే) సెలవు కూడా ఉంటుంది.