మెదక్ జిల్లా బాలల సంరక్షణ కేంద్రాన్ని కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎస్పీ శ్రీనివాస్ రావు సందర్శించారు. చిన్నారులతో ముచ్చటించి, వారి అవసరాలు, సమస్యలు తెలుసుకున్నారు. కేంద్రంలో అన్ని సౌకర్యాలు మెరుగుపరుస్తామని, పిల్లలకు మెరుగైన వాతావరణం కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి తదితరులు పాల్గొన్నారు.