నిజాంపేటలోని జిల్లా పరిషత్ హైస్కూల్‌ను కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థుల హాజరు రిజిస్టర్‌ను పరిశీలించి, గైర్హాజరైన విద్యార్థులు క్రమం తప్పకుండా బడికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. తరగతి గదుల్లో విద్యార్థులను ప్రశ్నించి వారి విద్యా సామర్థ్యాన్ని పరీక్షించారు. పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో చదువుపై మరింత దృష్టి పెట్టాలని విద్యార్థులకు సూచించారు.