పెద్దశంకరంపేటలో భవాని మార్ట్ వద్ద రెండు రోజుల క్రితం మృతి చెందిన లేగదూడ కళేబరాన్ని తొలగించకపోవడంతో గ్రామంలో తీవ్ర దుర్వాసన వ్యాపిస్తోంది. గ్రామ పంచాయతీకి సమాచారం అందించినా స్పందన లేదని, తొలగింపునకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే కళేబరాన్ని తొలగించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.