జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు మంగళవారం మంబోజిపల్లి చెక్‌పోస్ట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వాహన తనిఖీల రిజిస్టర్‌ను పరిశీలించి, సిబ్బంది నిర్వహిస్తున్న తనిఖీలను ప్రత్యక్షంగా గమనించారు. అక్రమ నగదు, మద్యం రవాణాను నివారించేందుకు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. ఎన్నికల శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.