50 ఏళ్లుగా సాగు చేస్తున్న భూమిపై వివాదం నెలకొనడంతో ఎస్సీ కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపిస్తూ, తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. రిజిస్ట్రేషన్ జరిగితే కాలనీలోని 44 కుటుంబాలు నిరాశ్రయులవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తూ, విచారణ పూర్తయ్యే వరకు ప్రక్రియను నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు.