నార్సింగి: 'రెవెన్యూ సమస్యల పరిష్కారానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తా'

నార్సింగి కేంద్రంలో నూతన తహశీల్దారుగా గ్రెస్ భాయ్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ఈ పదవిలో విధులు నిర్వర్తించిన షేక్ కరీం ఉద్యోగ విరమణ నేపథ్యంలో ఆయన స్థానంలో గ్రెస్ భాయ్ నియమితులయ్యారు. శుక్రవారం మాట్లాడుతూ మండలంలో అన్ని రెవెన్యూ సమస్యల పరిష్కారానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరువ చేస్తాను, కుల, ఆదాయ ధ్రువ పత్రాల మంజూరులో పారదర్శకత పాటిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్