మనోహరాబాద్ (మం) కాళ్లకల్లో మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి జన్మదిన వేడుకలు, మైనంపల్లి వర్గం కార్యకర్త జన్మదిన వేడుకల నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు తూప్రాన్ సీఐ రంగకృష్ణ, రామాయంపేట సీఐ వెంకటరాజా గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు భారీగా మోహరించారు. కార్యకర్త పుట్టినరోజు వేడుకలు జరిపించి పంపించారు.