హవేలిఘనపూర్ మండలం సర్ధనగేట్–బూరుగుపల్లి రహదారిపై విద్యుత్ వైర్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించే విషయంలో విద్యుత్ శాఖ, అటవీ శాఖ సిబ్బంది మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చెట్ల తొలగింపును అటవీ శాఖ సిబ్బంది అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ పెరిగి రోడ్డుపైనే గొడవకు దారితీసినట్లు స్థానికులు తెలిపారు. అనంతరం ఇరు శాఖల సిబ్బంది పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం.