నర్సాపూర్ పురపాలక కమిషనర్ శ్రీరామ్ చరణ్ రెడ్డి హైదరాబాద్‌లోని సెక్రటేరియట్‌కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపాలిటీ కమిషనర్ తిరుపతి నర్సాపూర్‌లో అదనపు బాధ్యతలు స్వీకరించారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా వార్డు సభ నిర్వహించనున్నట్లు తిరుపతి తెలిపారు.