రామచంద్రపురం: రెండు పడకల ఇళ్లలో వసతులు కల్పించండి

కొల్లూరు రెండు పడకల ఇళ్లలో అన్ని వసతులు కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. కొల్లూరు అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇక్కడ 7, 258 ఇళ్లలో 30 వేల జనాభా నివాసం ఉంటున్నారని చెప్పారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాల, అంగన్వాడి కేంద్రాలను ప్రారంభించాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్డీవో రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్