తెలంగాణలో టీచర్లకూ మధ్యాహ్న భోజనం

TG: CM రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ-కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులతో పాటు విధులు నిర్వహించే ఉపాధ్యాయులు, లెక్చరర్లు, నాన్-టీచింగ్ సిబ్బందికి కూడా ఉచిత అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించనుంది. ప్రస్తుతం ఈ పథకాలు విద్యార్థులకు మాత్రమే అమలవుతుండగా, తాజా నిర్ణయంతో టీచర్లు, ఇతర సిబ్బందికీ విస్తరించనున్నారు. దీనివల్ల విద్యాసంస్థల్లో బోధనకు మరింత అనుకూల వాతావరణం ఏర్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

సంబంధిత పోస్ట్