TG: ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్‌ను ప్రభుత్వం అందజేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అలాగే అల్పాహారంతోపాటు విద్యార్థులకు పాలను కూడా అందించనుంది. పాల సరఫరా కోసం విజయ డెయిరీకి రూ.120 కోట్ల ఆర్డర్ ఇచ్చింది. జూన్‌లో స్కూళ్లు తెరిచేనాటికి 150-200 ML టెట్రా ప్యాకెట్లను అందించేందుకు సిద్ధం చేస్తోంది. అయితే వారానికి 3 రోజులు పాలు, మూడు రోజులు రాగి జావను అందించనుంది. అలాగే మధ్యాహ్న భోజన పథకంలో చేపల కూరను కూడా అందించాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మెనూలో దానిని చేర్చింది.