నిమిష ప్రియ ఉరిశిక్ష వాయిదా పడింది.. రద్దు కాలేదు: కేంద్రం

కేరళ నర్సు నిమిష ప్రియ కేసులో కేంద్రం శుక్రవారం కీలక ప్రకటన చేసింది. మరణశిక్ష రద్దు నివేదికలను భారత్ తిరస్కరించింది. నిమిష ఉరిశిక్ష వాయిదా మాత్రమే పడిందని, రద్దు కాలేదని స్పష్టం చేసింది. ఈ కేసుపై భారత్, యెమెన్‌తో చర్చలు జరుపుతుందని విదేశాంగశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. ‘మా ప్రయత్నాల ఫలితంగా యెమెన్‌లో నిమిషాకు ఉరిశిక్ష వాయిదా పడింది. ఈ సమస్యను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం’ అని తెలిపారు.

సంబంధిత పోస్ట్