TG: సచివాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విత్తన సరఫరా, లభ్యతపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కంపెనీల వారీగా అందుబాటులో ఉన్న విత్తనాల లభ్యతపై మంత్రి ఆరా తీశారు. రాబోయే ఖరీఫ్ సాగు నాట్లకు అవసరమైన విత్తనాలను సకాలంలో అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమీక్షలో కార్యదర్శులు అన్వేశ్‌రెడ్డి, సురేంద్రమోహన్, డైరెక్టర్ గోపి పాల్గొన్నారు.