నల్గొండ(D) దామరచర్లలో ఏర్పాటు చేసిన యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని మంత్రులు భట్టి, ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ జాతికి అంకితం చేశారు. YTPSలోని 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన తొలి యూనిట్ ని మంత్రులు ప్రారంభించారు. 55 ఎకరాల్లో రూ.970 కోట్లతో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌ను నిర్మించనున్నారు. వనమహోత్సవంలో భాగంగా మంత్రులు మొక్కలు నాటి భూనిర్వాసితులతో మాట్లాడారు. ఆగస్టు 15 లోపు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు.