ఫారం-6 డిక్లరేషన్‌పై అపోహలు.. క్లారిటీ ఇచ్చిన ఎన్నికల సంఘం

ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు లేని వారు తిరిగి దరఖాస్తు చేసుకునే విషయంలో భారత ఎన్నికల సంఘం (ECI) కీలక స్పష్టతనిచ్చింది. అక్టోబర్ 14 నాటి ఢిల్లీ హైకోర్టు తీర్పును ఉటంకిస్తూ, గతంలో ఓటర్లుగా నమోదైన వారు కూడా తుది జాబితా కోసం ఫారం-6 సమర్పించవచ్చని స్పష్టం చేసింది. ఇలా చేయడం తప్పుడు డిక్లరేషన్ కాదని, దీనిపై ఎటువంటి చట్టపరమైన చర్యలు ఉండవని పేర్కొంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు (CEO) ఈసీ లేఖ రాసింది. ఈ ప్రక్రియతో ఓటర్ల అపోహలను తొలగించే ప్రయత్నం చేసింది.

సంబంధిత పోస్ట్

✕
✕