స్విస్‌ అధ్యక్షుడికి మోదీ అదిరిపోయే గిఫ్ట్స్‌

ప్రధాని నరేంద్ర మోదీ స్విట్జర్లాండ్‌ అధ్యక్షుడు గై పార్మెలిన్‌కు భారత్‌లో తయారైన మూడు రకాల ప్రత్యేక చీజ్‌లు, కశ్మీరీ వాల్‌ ప్యానెల్‌ను బహుమతులుగా అందించారు. ఈ చీజ్‌లలో 'గుల్మార్గ్‌' ఫ్రెంచ్‌ స్టైల్‌ బ్రి చీజ్‌ (సూపర్‌ గోల్డ్‌ అవార్డు పొందింది), 'కోణార్క్‌' ఫ్రెంచ్‌ టోమ్‌ స్టైల్‌ చీజ్‌ (వరల్డ్‌ చీజ్‌ అవార్డ్స్‌లో గోల్డ్‌, సిల్వర్‌ అవార్డులు పొందింది), 'యూర్‌' స్విస్‌ గ్రూయేర్‌ స్ఫూర్తితో తయారైన మౌంటెన్‌ స్టైల్‌ చీజ్‌ ఉన్నాయి. కశ్మీరీ వాల్‌ ప్యానెల్‌ను హిమాలయన్‌ వాల్‌నట్‌ కలపతో, శతాబ్దాల నాటి కశ్మీరీ చెక్క శిల్పకళతో తయారు చేశారు. పార్మెలిన్‌ భార్యకు గుజరాత్‌కు చెందిన కచ్చీ షాల్‌, సదేలీ బాక్స్‌ను బహుకరించారు.

సంబంధిత పోస్ట్

✕
✕