ఈ నెల 15 నుంచి కొత్త పట్టాపాస్ బుక్ పొందిన వారి ఖాతాల్లోకి డబ్బులు

TG: కొత్తగా వ్యవసాయ భూములు కొనుగోలు చేసి పట్టాదారు పాస్‌బుక్‌లు పొందిన రైతులకు ప్రభుత్వం ఈ నెల 15 నుంచి 20వ తేదీ మధ్యలో రైతు భరోసా డబ్బులు విడుదల చేయనుంది. అలాగేే ఈ పథకం కింద రెండో విడత పెట్టుబడి సాయాన్ని ఈ నెల15న విడుదల చేయనుంది. ఇప్పటికే తొలి విడతగా ఎకరాకు 6,000 చొప్పున 70 లక్షల మంది రైతులకు రూ.3,590 కోట్లు జమ చేశారు. 2వ విడతలో 5 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు నగదు జమ చేయనున్నారు. ఏప్రిల్ నెలాఖరులోగా చివరి విడత డబ్బులు అందజేస్తారు.

సంబంధిత పోస్ట్