తల్లులను గౌరవించే సంప్రదాయం పురాతన గ్రీస్ నుండి ప్రారంభమైంది, అక్కడ 'రియా' దేవతను 'మదర్ ఆఫ్ గాడ్స్'గా పూజించేవారు. 17వ శతాబ్దంలో ఇంగ్లాండ్‌లో 'మదరింగ్ సండే' పేరుతో తల్లులకు గౌరవం తెలిపేవారు. ఆధునిక మాతృ దినోత్సవాన్ని అమెరికాలో అన్నా జార్విస్ తన తల్లి జ్ఞాపకార్థం ప్రారంభించారు. ఆమె తల్లి అంతర్యుద్ధ సమయంలో సైనికులకు సేవ చేసింది. 1908లో తొలి మాతృ దినోత్సవం జరగగా, 1914లో మే రెండో ఆదివారం అధికారికంగా జాతీయ దినోత్సవంగా ప్రకటించారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేమను వ్యక్తం చేసే రోజుగా మారింది.