బెంగళూరు మున్సిపల్ శాఖ అధికారులు.. రోడ్లపై చెత్త వేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తున్న వారిని గుర్తించి, వారి ఇంటి ముందే ఆ చెత్తను పోశారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ.2 వేల జరిమానా కూడా విధించారు. మరోసారి రోడ్లపై చెత్త వేయకూడదనే అవగాహన కల్పించేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.