గడ్డకట్టే చలిలోనూ నగ్నంగానే నాగసాధువులు.. ఎందుకో తెలుసా..?

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జనవరి 13న ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ మహా కుంభమేళాకు భక్తులతో పాటు నాగసాధువులు కూడా వస్తున్నారు. అయితే వాళ్లు గడ్డకట్టే చలిలోనూ వస్త్రాలు కూడా ధరించకుండా నగ్నంగానే ఉంటారు. దీనికి కారణమేమిటంటే.. వాళ్లు అగ్ని సాధన, నాడి శోధన, మంత్ర పఠనం వంటి సాధనలు చేస్తారు. దీంతో తమ శరీరంలో అంతర్గత వేడినీ పెంపొందించుకుంటారు. ఇది వారి శరీరాలను కఠినమైన పరిస్థితుల్లో కూడా వెచ్చగా ఉంచేందుకు సహాయపడుతుంది.

సంబంధిత పోస్ట్