నాగర్ కర్నూల్: నూతన కలెక్టర్ గా హేమంత్ కేశవ్ పాటిల్ బాధ్యతలు

నాగర్ కర్నూల్ జిల్లా 9వ కలెక్టర్‌గా 2019 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి హేమంత కేశవ్ పాటిల్ ఆదివారం అధికారిక బాధ్యతలు స్వీకరించారు. నూతన కలెక్టర్‌కు కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆర్డిఓలు, కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడం తన ప్రధాన లక్ష్యమని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన వారికి సమర్థవంతంగా చేరేలా చర్యలు తీసుకుంటామని, ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్