నాగర్ కర్నూల్ జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగిందని కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని ప్రజావాణి సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభమైంది. 67 దుకాణాలకు గాను మొత్తం 1518 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుదారుల సమక్షంలో ఎక్సైజ్ అధికారులతో కలిసి మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేశారు.