విధి నిర్వహణలో అలసత్వం వహించొద్దు

గురువారం కొండమల్లేపల్లి పీహెచ్‌సీ పరిధిలోని ఆయుష్మాన్‌ ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ పుట్ల శ్రీనివాస్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది విధి నిర్వహణలో అలసత్వం వహించొద్దని, సమయపాలన పాటిస్తూ రోగులకు అంకితభావంతో సేవలందించాలని ఆయన సూచించారు. రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ తనిఖీలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ రాహుల్‌, వేణుగోపాల్‌, డాక్టర్‌ కళ్యాణ్‌, మెడికల్‌ ఆఫీసర్‌ ఉషారాణి, సూపర్‌వైజర్స్‌ సుగుణబాయి, రాణి, హరీష్‌ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్