నల్గొండ: బూత్ స్థాయి అధికారుల పాత్ర కీలకం

పారదర్శక ఓటరు జాబితా తయారీలో బూత్ స్థాయి అధికారుల (బిఎల్ఓ) పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బూత్ స్థాయి అధికారులకి ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలలో భాగంగా గురువారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గం వేములపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బిఎల్ఓలకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్