గుర్రంగూడా బంజారా సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. అధ్యక్షులుగా బానావత్ మోతిలాల్ నాయక్, కార్యనిర్వాహక అధ్యక్షులుగా కేతావత్ కిరణ్ నాయక్, ప్రధాన కార్యదర్శిగా మూడవత్ అశోక్ నాయక్ ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులు రతన్ నాయక్, భాను నాయక్ ల చేతుల మీదుగా వీరు ప్రమాణం చేశారు. అనంతరం అధ్యక్షులు మోతిలాల్ నాయక్, ప్రధాన కార్యదర్శి అశోక్ నాయక్ లు మాట్లాడుతూ, గుర్రంగూడా బంజారా ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కొర్ర శంకర్ నాయక్ తో పాటు పలువురు సభ్యులు, బంజారా ప్రజలు పాల్గొన్నారు.