నల్గొండ: టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి

నల్గొండ జిల్లాను టీబీ (క్షయ) రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సవాల్ గా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గురువారం మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో “టీబీ ముక్త్ భారత్ అభియాన్” పై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశానికి ఆమె హాజరయ్యారు. సాంకేతికత అంతగా అభివృద్ధి చెందని రోజుల్లోనే మన దేశంలో కమ్యూనిటీ సహకారంతో అంటువ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కొని పారద్రోలిన ఘనత వైద్య ఆరోగ్యశాఖకు ఉందని అన్నారు.

సంబంధిత పోస్ట్