చండూరు మున్సిపల్ కమిషనర్ ఎల్. మల్లేశం మాట్లాడుతూ, మున్సిపాలిటీకి చెందిన ప్రజా ఆస్తులను కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు. కృష్ణ చైతన్య వెంచర్ లేఅవుట్ ఆమోదం సమయంలో, ప్రజా ప్రయోజనాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం మొత్తం విస్తీర్ణంలో 10% భూమిని మున్సిపాలిటీకి కేటాయించారని, ఈ మేరకు 5,042 గజాల భూమిని మున్సిపాలిటీకి అప్పగించారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, శుక్రవారం చండూరు మున్సిపల్ అధికారులు సంబంధిత భూమి రికార్డులు, లేఅవుట్ పత్రాలు, ఇతర ఆధారాలను పరిశీలించి, భూమిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.