శుక్రవారం నల్గొండ జిల్లా గట్టుపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జడ్పీ సీఈవో శ్రీనివాసరావు, అధికారులకు మండలాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. నూతన మండలంలో అభివృద్ధి కార్యక్రమాలను నాణ్యతతో చేపట్టాలని, నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ కాంట్రాక్టర్లకు సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. క్రిమిటోరియం, డంపింగ్ యార్డును పరిశీలించి, వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు.