నామినేషన్ పత్రాల సమర్పణ సమయంలో కుల ధ్రువీకరణ పత్రం బదులుగా గజిటెడ్ డిక్లరేషన్ సమర్పించినా అంగీకరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. రెండవ విడత నామినేషన్ల సందర్భంగా సోమవారం నల్గొండ జిల్లా పెద్దవూర గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. అభ్యర్థులు నామినేషన్ల పరిశీలన సమయం వరకు కుల ధ్రువీకరణ పత్రం సమర్పించేలా తెలియజేయాలని ఆమె ఆదేశించారు. నామినేషన్ కేంద్రంలో సౌకర్యాలను కూడా కలెక్టర్ పరిశీలించారు.