ప్రాథమిక స్థాయి విద్య పిల్లల భవిష్యత్తుకు మొదటి అడుగు

జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం త్రిపురారం మండలంలోని మినీ గురుకులం గిరిజన బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక విద్య పిల్లల భవిష్యత్తుకు పునాది అని ఆమె పేర్కొన్నారు. తరగతి గదులు, మధ్యాహ్న భోజనం, హాస్టల్ సౌకర్యాలను పరిశీలించి, బాలికలకు అందిస్తున్న సేవలపై ఉపాధ్యాయులతో చర్చించారు. స్కూల్ భవనాన్ని రెండు నెలల్లో పూర్తి చేయాలని, అవసరమైన మరమ్మతులు, సదుపాయాలకు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్