నల్లగొండ జిల్లా వెలిమినేడులోని నోష్ ఫార్మా పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనలో గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ. కోటి చొప్పున పరిహారం అందించాలని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్ చేశారు. బుధవారం డీఆర్‌డీఏ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను, వారి కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పరిశ్రమలో రియాక్టర్ పేలి కార్మికులు మృతి చెందడంతో పాటు అనేక మంది గాయపడినా కార్మిక శాఖ మంత్రి పరామర్శించకపోవడం శోచనీయమని ఆయన అన్నారు.