సంక్రాంతికి ప్రయాణం సాఫీగా సాగేలా చర్యలు

సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుండి ఆంధ్రాకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం, నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు కట్టంగూర్ మండల పరిధిలో రోడ్డు భద్రతా చర్యలు చేపట్టినట్లు ఎస్ఐ మునుగోటి రవీందర్ తెలిపారు. శుక్రవారం పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వాహనదారులు వేగ నియంత్రణ పాటించి సురక్షితంగా గమ్యస్థానాలు చేరుకోవాలని సూచించారు. మండల పరిధిలోని 15 కిలోమీటర్ల హైవేపై యూటర్న్‌ల వద్ద రేడియం స్టిక్కర్లు, బారీకేడ్లు ఏర్పాటు చేసి ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.

సంబంధిత పోస్ట్