నేటితో మున్సిపాలిటీ పదవీకాలం పూర్తి

నల్గొండ జిల్లా నకిరేకల్ మున్సిపాలిటీ పదవీకాలం నేటితో ముగియనున్న నేపథ్యంలో, మున్సిపాలిటీ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు పల్లె విజయ్, చింత స్వాతి శివమూర్తిలకు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బిఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలో నకిరేకల్ మున్సిపాలిటీ అభివృద్ధిలో గణనీయమైన పురోగతి సాధించిందని, కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, తాగునీటి వంటి మౌలిక వసతుల కల్పనలో చైర్మన్, కౌన్సిలర్లు కీలక పాత్ర పోషించారని తెలిపారు.

సంబంధిత పోస్ట్