వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా అన్ని శాఖలు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైద్య ఆరోగ్యశాఖ చేపట్టిన వంద రోజుల కార్యచరణ ప్రణాళిక అమలులో పురోగతి సాధించాలని సూచించారు. రాబోయే వేసవిలో ప్రజలు, పశువులు తాగునీటి ఇబ్బందులు పడకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.