లంచం అడగడం, తీసుకోవడం నేరం

లంచం అడగడం, తీసుకోవడం నేరమని జిల్లా కలెక్టర్ త్రిపాఠి అన్నారు. ఈ నెల 3 నుండి 9 వరకు నిర్వహించనున్న తెలంగాణ ఏసీబీ వారోత్సవాలలో భాగంగా బుధవారం ఆమె తన చాంబర్లో లంచం నేరమని తెలిపేలా రూపొందించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. పరిపాలనలో పారదర్శకత అవసరమని, ఎవరైనా ప్రభుత్వ అధికారి, ఉద్యోగి లంచం అడిగితే వెంటనే 1064 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి తెలియజేయాలని ఆమె తెలిపారు. కాల్ చేసిన వారి పేరును గోప్యంగా ఉంచడం జరుగుతుందని, అవినీతిని అరికట్టడంలో ప్రతి ఒక్కరు సహకరించాల్సిన అవసరం ఉందని అన్నారు.

సంబంధిత పోస్ట్