జిల్లా నూతన కలెక్టర్‌గా బడుగు చంద్రశేఖర్‌

జిల్లా నూతన కలెక్టర్‌గా బడుగు చంద్రశేఖర్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం సంగారెడ్డిలో లోకల్‌బాడీ అదనపు కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆయన పదోన్నతిపై నల్లగొండ కలెక్టర్‌గా వస్తున్నారు. నల్లగొండ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఇలా త్రిపాఠి నిజామాబాద్‌కు బదిలీ అయ్యారు. ఇలా త్రిపాఠి 2024 అక్టోబరు 28న బాధ్యతలు స్వీకరించి, దాదాపు 14 నెలల పాటు జిల్లాలో విద్యా, వైద్య రంగాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, హాస్టళ్లను నిరంతరం తనిఖీ చేసి, వాటి అభివృద్ధికి కృషి చేశారు.

సంబంధిత పోస్ట్