నల్గొండ వన్ టౌన్ పరిధిలో బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని నల్గొండ అడిషనల్ ఎస్పీ రమేష్ సూచించారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో కార్పొరేటర్లతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముస్లిం సోదర, సోదరీమణులు శాంతియుతంగా పండుగ జరుపుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని కోరారు. పండుగ రోజు ఈద్గాలు, మసీదుల వద్ద తగిన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామని, ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.