నార్కెట్ పల్లి: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

రోజువారి తనిఖీలలో భాగంగా నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం నార్కెట్ పల్లి మండలంలో పర్యటించారు. పలు ప్రభుత్వ సంస్థలను, ప్రభుత్వ సిబ్బంది పనితీరును పరిశీలించారు. ముందుగా జిల్లా కలెక్టర్ మండలంలోని బ్రాహ్మణ వెల్లేములలో ఏర్పాటుచేసిన దాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి కేంద్రానికి వచ్చిన వరి ధాన్యాన్ని, రికార్డుల నిర్వహణను, ట్రక్ షీట్లను తనిఖీ చేశారు. మూడు, నాలుగు రోజుల్లో ఈ కేంద్రం ద్వారా ధాన్యం కొనుగోలు మొత్తాన్ని పూర్తి చేయాలని నిర్వాహకులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్