ప్రజల సేవలో ఎల్లప్పుడూ జిల్లా పోలీస్ శాఖ

జిల్లా ప్రజలందరికీ 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంవత్సరం జిల్లా ప్రజలు శాంతి, భద్రత, ఆరోగ్యం, సుఖసంతోషాలతో ఉండాలని జిల్లా పోలీస్ శాఖ తరుపున ఆకాంక్షిస్తున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ తెలిపారు. గత సంవత్సరం జిల్లా ప్రజల సహకారంతో శాంతి భద్రతలను సమర్థవంతంగా నిర్వహించగలిగామని, నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, మహిళలు మరియు పిల్లల భద్రత, సైబర్ నేరాల నివారణ, మత్తు పదార్థాల నియంత్రణ వంటి అంశాల్లో ప్రజల సహకారం ప్రశంసనీయమని ఎస్పీ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్