ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

నల్లగొండ జిల్లా పోలీసు శాఖలో పరిపాలనా పనితీరు, కేసుల దర్యాప్తు పురోగతి, రికార్డుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదివారం నల్లగొండ డిఎస్పీ కార్యాలయం మరియు టూ టౌన్ సీఐ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయాల్లో నిర్వహిస్తున్న గ్రేవ్ కేసుల క్రైమ్ ఫైల్స్, పెండింగ్ కేసుల రికార్డులు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించిన ఫైల్స్‌ను సవివరంగా తనిఖీ చేసి, బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా దర్యాప్తు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.

సంబంధిత పోస్ట్