నల్గొండ జిల్లా పోలీస్ శాఖలో ఫింగర్ ప్రింట్ విభాగంలో హోమ్ గార్డ్ గా పని చేస్తున్న యం. డి సలీంను పదవి విరమణ పొందుతున్న సందర్భంగా నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఘనంగా సత్కరించి వారు పోలీసు శాఖకు అందించిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీస్ శాఖలో హోమ్ గార్డ్ గా 34 సంవత్సరాల పాటు సేవలందించి పదవి విరమణ పొందడం అభినందనీయమని అన్నారు.