గత ఆరు సంవత్సరాలుగా నిరుపేదలకు వితంతు, వికలాంగుల, ఒంటరి స్త్రీలకు పెన్షన్ ఇవ్వడం లేదని దరఖాస్తు చేసుకున్నప్పటికీ రేషన్ కార్డులు మంజూరు చేయడం లేదని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి డిమాండ్ చేశారు. ఈరోజు నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఐద్వా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.