నల్గొండ: వృత్తి వ్యాపారాల ద్వారా ఆర్థిక సాధికారత సాధించవచ్చు

మహిళలు చిన్న చిన్న వృత్తి వ్యాపారాల ద్వారా ఆర్థిక సాధికారత సాధించవచ్చని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సూక్ష్మ, చిన్న మధ్య తరహా వ్యాపారాల, సంస్థల ఏర్పాటుపై స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు ఉద్దేశించి నల్గొండ మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన ఒకరోజు అవగాహన సదస్సుకు హాజరయ్యారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారి కంటే ప్రైవేటు వ్యాపారాలు నిర్వహిస్తున్న వారే ఎక్కువ మందికి సహాయం అందించవచ్చని అన్నారు.

సంబంధిత పోస్ట్